Site icon NTV Telugu

AP Fake Liquor Case: అద్దె గది, ఫినాయిల్ స్టిక్కర్, ఆర్టీసీ కొరియర్.. జనార్ధన్ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు!

Janardhan Rao Remand Report

Janardhan Rao Remand Report

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావును ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్‌ కీలక వివరాలను వెల్లడించారు. జనార్ధన్ 2021 నుంచి నకిలీ మద్యం తయారీ వ్యాపారం చేస్తున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకొని అక్రమ మద్యం తరలించారు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి.. నకిలీ ఇన్వాయిస్‌లతో విజయవాడ ఇబ్రహీంపట్నం పంపారు. జనార్ధన్ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు ఏంటో చూద్దాం.

నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన జనార్దన్ రావు.. 2012 నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. 2021 నుంచి అక్రమ మధ్యం వ్యాపారం మొదలెట్టారు. ANR బార్‌లో నష్టాలు చవిచూసిన జనార్ధన్.. లాభాలు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో హైవే మీద ఉన్న బార్ ఇతర ప్రదేశానికి మార్చారు. వ్యాపారంలో పోటీ పెరగడం, కరోనాతో 2021 వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడిన జనార్ధన్.. 2021 నుండి నకిలీ మద్యం తయారీ వ్యాపారం మొదలెట్టారు. మొట్టమొదటిగా హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకొని అక్రమ మద్యం తరలించారు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి.. నకిలీ ఇన్వాయిస్‌లతో విజయవాడ ఇబ్రహీంపట్నం తరలించారు. అక్రమ మద్యం డబ్బాలపై ఫినాయిల్ స్టిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నం చేర్చేవారు. ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యం ఉన్నా ఎటువంటి అనుమానం తలెత్తకుండా వాటిపై ఫినాయిల్ అని స్టిక్కర్లు వేసేవారు. ఇబ్రహీం పట్నంలో కేసులో A5 నిందితుడు హాజీ రిసీవ్ చేసుకునేవాడు. ఈ అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్లో లూస్ విక్రయాలు చేయటం వలన పెద్దగా అనుమానం కలుగలేదు.

జనార్ధన్ రావు 2022లో E7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ నగరంలో మరో కొత్త బారు ప్రారంభించారు. అక్కడ నుంచి 35 లీటర్ల బాటిల్స్ లో అక్రమ మద్యం తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం ANR బార్లో అమ్మారు. 2023 జనవరిలో ఆరుగురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్ధన్‌కు.. అక్కడ తెలుగు వ్యక్తి కేసులో A3 బాలాజీ లిక్కర్ స్టోర్లో పరిచయం అయ్యాడు. అప్పటి నుండి రెగ్యులర్ టచ్లో జనార్ధన్, బాలాజీ ఉన్నారు. ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండడంతో గోవా నుండి ఖరీదైన లిక్కర్ బ్రాండ్ కొనుగోలు చేస్తున్నారని జనార్ధన్‌కు బాలాజీ చెప్పాడు. గోవాలో దొరుకుతున్న ఖరీదైన మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తానని జనార్ధన్‌కు బాలాజీ చెప్పాడు. డిస్టలరీలతో బాలాజీకు ఉన్న పరిచయాలతో క్యారమిల్, స్పిరిట్ ఇతర ముడిపదార్ధాలు పంపగా.. 2023 నుండి ఇబ్రహీంపట్నం ANR బార్లో జనార్ధన్ కల్తీ మద్యం తయారీ ప్రారంభించారు. 2023 ఏప్రిల్ నుండి కల్తీ మద్యం తయారీ వ్యాపారం ప్రారంభించారు. నకిలీ లేబుల్స్ కేసులో A4గా ఉన్న రవి హైదరాబాద్ నుండి సరఫరా చేశాడు. బాటిల్స్ మూతలు హైదరాబాద్ నుండి సరఫరా చేసిన దార బోయిన ప్రసాద్.

Also Read: MLA Balakrishna: అధైర్య పడొద్దు.. రైతులకు అండగా ఉంటా!

బెంగుళూరు, ముంబై, డిల్లీ నుండి ఏపీకి జనార్ధన్‌కు బాలాజీ ఐరిష్ వ్యానులో సరఫరా చేశాడు. ANR బారులో ఒకరోజు ఉండి కల్తీ మద్యం కోసం బాలాజీ మిశ్రమం తయారు చేసేవాడు. తరువాత మిశ్రమం సహాయంతో జనార్ధన్ రావు సోదరుడు జగన్మోహన్ మంజీర విస్కీ,కేరళ మార్ట్ విస్కీ, ఓల్డ్ అడ్మినరల్, క్లాసిక్ బ్లూ వంటి కల్తీ మద్యం తయారు చేశాడు. మొదట కల్తీ మద్యం బాటిల్స్ ANR బార్లోనే విక్రయయించేవారు. ఒక్కో క్వాటర్ బాటిల్పై 40 రూపాయలు లాభం గడించిన జనార్ధన్ రావు. 2024 ఎన్నికల సమయాల్లో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయలేదు. కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా జనార్ధన్ నిలిపివేశాడు.

Exit mobile version