Site icon NTV Telugu

Andhra Pradesh: రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై చర్చ.. ఉద్యోగ సంఘాల కీలక భేటీ

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.. రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు.. సీఎం దగ్గర సమీక్షలో ఉన్నందున సమావేశానికి సీఎస్ జవహర్ రెడ్డి హాజరుకాలేకపోయారు.. ఇక, సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు.. చర్చల సారాశాంన్ని వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ నియామకానికి సంబంధించి సిక్స్ పాయింట్ ఫార్ములాతో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జోనల్ వ్యవస్థ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి అని తెలిపారు ఏపీ సెక్రెటరియేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా 26 జిల్లాల ఏర్పాటు జరిగింది. జిల్లాల సంఖ్య పెరగడం వలన జోనల్ వ్యవస్థ పై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేయాల్సి ఉందన్న ఆయన.. జోనల్ వ్యవస్థ పై ఎలా చేస్తే బాగంటుందనే దానిపై మా అభిప్రాయం అడిగారు.. ఇప్పుడు ఉన్న నాలుగు జోన్లు కొనసాగించాలా..? లేదా ఆరు జోన్లకు పెంచాలా…? అనే దానిపై చర్చ జరిగిందని.. తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏ జోన్ లో కలపాలనేది సమస్యగా ఉందన్నారు. లోకల్ స్టేటస్ పై గతంలో 10వ తరగతి లోపు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ స్టేటస్ ఉండేది.. దానిని 7th వరకు తగ్గించాలనే దానిపై చర్చ జరిగిందని వెల్లడించారు.

ఇక, లోకల్ క్యాడర్‌లో ఏ పోస్టు ఉండాలి.. జోనల్ స్థాయిలో ఏ పోస్టు ఉండాలి అనే దానిపై మా అభిప్రాయం అడిగారు.. రాష్ట్రంలోని ఉద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కాబట్టి EC మెంబెర్స్‌తో అభిప్రాయాలు కూడా తీసుకొని లిఖిత పూర్వకంగా మా అభిప్రాయం చెబుతాం అని చెప్పినట్టు తెలిపారు వెంకటరామిరెడ్డి. రాష్ట్రపతి ఉత్తర్వుల వలన మా సచివాలయం ఉద్యోగులకు మేజర్ ఉన్న సమస్య 12 1/2 శాతం కోటాలో బయట వాళ్ళు ASO, SOలుగా సచివాలయం లోకి రావడం జరుగుతుంది.. అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ASO, SOలు కూడా CTO, ACTOగా వెళ్లే వాళ్లకు ఇబ్బంది ఉందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల వలన లోకల్ క్యాడర్ కి వెళ్ళే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం.. ప్రభుత్వ అందుకు సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు ఏపీ సెక్రెటరియేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి.

ఇక, 1974లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రవేశపెట్టారు.. అప్పటి నుండి నాలుగు జోన్లుగా కొనసాగుతున్నాయి.. ఈ నాలుగు జోన్లను ఆరు చేయాలా? ఏడు చేయాలా? అనే దాని పై చర్చ జరిగిందని తెలిపారు ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్. మొత్తాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా చేయాలని కోరామని.. ఏకాభిప్రాయానికి వచ్చాక కేంద్రానికి పంపిస్తారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ వుంది.. జూనియర్ అసిస్టెంట్ స్థాయి జిల్లా క్యాడర్ గానూ, సుపరిండెంట్ లోపు ఉన్న క్యాడర్ ను జోనల్ క్యాడర్ గానూ, ఫస్ట్ గెజిటెడ్ స్థాయిని మల్టీ జోనల్ క్యాడర్ గానూ గతంలో ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుకూలంగా ఉంచాలి. జిల్లా స్ధాయి బదిలీలను వారి ఒప్పుదలతో చేయాలని కోరామని తెలిపారు. గోదావరి, వంశధార, హంద్రీనీవా, వెలిగొండ, శ్రీశైలం, పోలవరం వంటి ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వారికి రాష్ట్రపతి ఉత్తర్వులు గతంలో పని చేయవు.. రూ.500 కోట్లు దాటిన ప్రతీ ప్రాజెక్టుకు రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ సిస్టంను అమలు చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ లే మొత్తం ప్రాజెక్ట్ ల పనులు చేస్తున్నారు.. ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే వుంది. ప్రాజెక్టుల వద్ద సిబ్బంది తక్కువగా, పని ఎక్కువగా ఉంది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను దూర ప్రాతానికి బదిలీ చేస్తే వారు ఇబ్బందులు పడతారు. అందుకే ఆ నిబంధన సవరించమని కోరామన్నారు బండి శ్రీనివాస్‌.

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం 1975లో తెచ్చిన జోనల్ వ్యవస్థలో మార్పుల పై అభిప్రాయాలు అడిగారు.. 6 పాయింట్ ఫార్ములా కు అనుబంధంగా గతంలో ప్రెసిడెన్సీఎల్ ఆర్డర్ ను ఇచ్చారు. తెలంగాణ తరహా లో కొత్త జిల్లాలు ఏపీలో ఏర్పడ్డాక మార్పులు, చేర్పులపై చర్చించామని.. కొత్తజిల్లాలకు కేటాయించేటప్పుడు ఉద్యోగులకు ముందుగా ఆప్షన్ ఇవ్వమన్నాం.. ఉద్యోగులు వెళ్లేటప్పుడు సీనియారిటి పరిగణలోకి తీసుకోవాలని కోరామని తెలిపారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాప్పరజు వెంకటేశ్వర్లు. తెలంగాణలో 95 శాతం లోకల్ కి అవకాశం ఇస్తున్నారు. జోనల్ స్థాయిలో నియామకాలు జరిగినవి జిల్లా స్థాయిలో వుంటాయి.. ప్రస్తుతం వున్న 4 జోన్‌లను 6 జోన్ లుగా చేస్తే ఎలా వుంటుంది అని అడిగారని.. దీని పై ఆగష్టు 3వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా మా అభిప్రాయం చెబుతాం అని చెప్పినట్టు వెల్లడించారు బాప్పరజు వెంకటేశ్వర్లు.

Exit mobile version