Site icon NTV Telugu

Nandamuri Rama Krishna: రికార్డు ఓటింగ్.. తెలుగు జాతి మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!

Nandamuri Rama Krishna

Nandamuri Rama Krishna

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం 81.86గా నమోదైందని ఈసీ ప్రకటించింది. 2014లో 78.90 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ 1.5 శాతం పెరిగింది. రికార్డు పోలింగ్‌పై నందమూరి రామకృష్ణ స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగిందిని.. తెలుగు జాతి మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికల గురించి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో రామకృష్ణ మాట్లాడుతూ… ‘అందరికీ శుభ దినం. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్లో పాల్గొనేందుకు కదలి వచ్చారు. అలా కదిలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకి, తెలుగు మహిళలకు, ఓటరు మహాశయులు అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.

Also Read: Prabhas: నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి!

‘ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి.. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు. మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు. ఇది తథ్యం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు యువతీ యువకులకు, ఓటర్ మహాశయులకు తెలుగు జాతి మొత్తానికి పేరుపేరునా మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు’ అని రామకృష్ణ పేర్కొన్నారు.

Exit mobile version