Site icon NTV Telugu

AP Elections 2024: డ్వాక్రా గ్రూప్‌లకు ఈసీ కీలక ఆదేశాలు

Mukesh Kumar Meena

Mukesh Kumar Meena

AP Elections 2024: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు.. డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టోద్దని సీఈవో ఆదేశించారు.. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా డ్వాక్రా మహిళలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఈవో.. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా కార్యకలాపాలు చేపట్టోద్దని స్పష్టం చేశారు.. వ్యక్తిగతంగా, బృందంగా కానీ ఎస్‌హెచ్‌జీలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వదన్నారు.. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూదదని సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్‌ కుమార్‌ మీనా. కాగా, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఏపీలో జరగనుండగా.. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం విదితమే. ఇప్పటికే గ్రామ, సచివాలయ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read Also: Yarlagadda VenkatRao: సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి..

Exit mobile version