Site icon NTV Telugu

AP Elections 2024: ఎన్నికల ‘సిరా’పై తప్పుడు ప్రచారం.. ఈసీ వార్నింగ్‌

Ap Cec

Ap Cec

AP Elections 2024: ఎన్నికలు ఏవైనా సరే.. వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం ఎన్నికల ‘ సిరా’ గుర్తు. ఎన్నికలల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు.. అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు.. ఇక, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలా మంది ఎన్నికల్లో ఓటేసిన తర్వాతా సిరా గుర్తును చూపుతూ.. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్‌ చేయడం చూస్తున్నాం.. అయితే, చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉందనే ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో గుప్పుమంది.. దీనిపై సీరియస్‌గా స్పందించారు రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా..

Read Also: Georgia : ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్జియాలో వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది

చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా..

Exit mobile version