NTV Telugu Site icon

AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు మీకోసం..

Dsc

Dsc

AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఏపీ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2024ని ప్రకటించారు. 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డ్రైవ్ లక్ష్యంగా పెట్టుకుంది, రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 12న ప్రారంభమవుతుంది మరియు ఏప్రిల్ 7 నాటికి ఫలితాలు ప్రకటించబడతాయి. ఖాళీల విషయానికి వస్తే 2,280 ఎస్‌జీటీ, 2,299 స్కూల్ అసిస్టెంట్, 1,264 టీజీజీ, 215 పీజీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.. ఇక, వివరణాత్మక నోటిఫికేషన్‌లు ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు..

ఇక, ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డీఎస్సీ -2024ను ప్రకటిస్తున్నాం.. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం అన్నారు. ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నాం.. మార్చి 7వ తేదీన డీఎస్సీ ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.. ఎస్జీటీ -2, 280, స్కూల్‌ అసిస్టెంట్‌- 2290 టీజీటీ- 1264, పీజీటీ -215, ప్రిన్సిపల్స్ పోస్టులు 42 ఉన్నాయన్నారు.. మా ప్రభుత్వంలో విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చింది.. 73 వేల కోట్ల రూపాయలను విద్యపై ఖర్చు పెట్టిందని గుర్తుచేశారు.. పిల్లలను గ్లోబల్ స్థాయి విద్యార్థులుగా తీర్చి దిద్దేందుకు ఫౌండేషన్ వేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నెలకు రెండు సార్లు విద్యా శాఖపై సమీక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేశారు.. తర్వాత మనసు మార్చుకుని ఇంగ్లీష్ మీడియం అవసరాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు. పిల్లలకు ఉచితంగా ట్యాబ్ లు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఏటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూన్ నాటికి రిక్రూట్మెంట్ పూర్తి అయి జూలై నాటికి వాళ్లంతా విధుల్లో ఉంటారు.. ఇక నుంచి జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తాం.. ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ అవుతాయి.. 2018 నోటిఫికేషన్ లో ఉన్న విధివిధానాలనే ఇప్పుడూ అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అన్నారు ఏపీ విద్యా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌.. ఫీజు కట్టడానికి ఈ నెల 21 కి చివరి తేదీగా ఉంటుందన్నా ఆయన.. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులు ఇవ్వటానికి చివరి తేదీగా తెలిపారు. రాష్ట్రంలోని 185 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. రెండు సెషన్స్ లో పరీక్షలు ఉంటాయి.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తాం.. జనరల్ క్యాటగిరీలో గరిష్ట వయస్సు 44 ఏళ్లు అని తెలిపారు ఏపీ విద్యా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌.

ఏపీ డీఎస్సీ 2024 వివరణాత్మక నోటిఫికేషన్ ఫిబ్రవరి 12 విడుదల చేయనున్నారు.. ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 12 నుండి 22 వరకు దరఖాస్తులు స్వీకరణ.. మాక్ టెస్ట్ ఫిబ్రవరి 24న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరీక్ష మార్చి 15 నుండి 30 వరకు నిర్వహించబడుతుంది, రెండు సెషన్‌లలో – ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను జారీ చేస్తారు. ఇక, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కీలక ప్రకటన చేశారు. AP TET 2024 రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ఫిబ్రవరి 23 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నారు. AP TET పరీక్షలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రెండు సెషన్‌లలో నిర్వహించబడతాయి. పరీక్షల తరువాత, ప్రిలిమినరీ ఆన్సర్ కీ మార్చి 10 న ప్రచురించబడుతుంది, అభ్యంతరాల విండో మార్చి 11 వరకు తెరిచి ఉంటుంది. తర్వాత ఫైనల్ కీ మార్చి 13న విడుదల కానుంది. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల కానున్నాయని తెలిపారు.