తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే డీఎస్సీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరోసారి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షల నిమిత్తం ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. వీటితోపాటు సెంటర్ల ఎంపిక ఆప్షన్లను కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Also read: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 2న మోడీ సభ!
ఈ పరీక్షల నేపథ్యంలోనే మార్చి 25న ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇదివరకే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. కాకపోతే ఈసీ నుండి ఎటువంటి అనుమతి రాకపోవడంతో.. రాష్ట్రంలో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా టేట్, డిఎస్సి పరీక్ష మధ్య కొద్దిగైన గ్యాప్ ఉండాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇదివరకు ఒకసారి పరీక్ష షెడ్యూల్ మార్చడం జరిగింది. మరోసారి ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ వాయిదా పడింది.
Also read: Mukhtar Ansari : ముఖ్తార్ మృతదేహం చూసేందుకు భారీగా తరలివచ్చిన మద్దతుదారులు
వీటితోపాటు ఏపీలో జరిగిన టెట్ పరీక్షల ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటికి సంబంధించి మార్చి 14వ తారీఖున ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎటువంటి ఫలితాలను వెల్లడించలేదు. ఎన్నికల కోడ్ కారణంతోనే వీటికి కూడా బ్రేక్ పడింది. ఏ పనులైనా కేవలం ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తేనే తాము ముందుకు వెళ్లగలమని విద్యాశాఖ ప్రకటించింది.