NTV Telugu Site icon

Deputy CM Amjad Basha: చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్

Deputy Cm Amjad Basha

Deputy Cm Amjad Basha

Deputy CM Amjad Basha: చరిత్ర సృష్టించటం జగన్ వల్లే సాధ్యం.. జగన్ అంటే ఒక బ్రాండ్ అంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే ఉత్సవాల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రూపకల్పన చేయటంలో మౌలానా అబుల్ కలాం పాత్ర కీలకమైనది.. యూజీసీ, అనేక సాంకేతిక సంస్థలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించనవే.. దార్శనికుడు మౌలానా అబుల్ కలాం.. ఆయన వేసిన బీజాలే ఇవాళ విద్యా రంగంలో మనం చూస్తున్న ఫలితాలు అని కొనియాడారు.

Read Also: Chandra Mohan: చంద్రమోహన్‌ చివరి సినిమా ఇదే!

ఇక, మౌలానా అబుల్ కలాం ఆదర్శాలు, స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళుతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు అంజాద్‌ బాష.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మా పిల్లలు ఉన్నత విద్య చదువుకోగలిగారు.. తండ్రికి మించిన తనయుడిగా మైనారిటీ వర్గాలకు ఆర్ధిక, రాజకీయ సాధికారత కల్పించారు జగన్ అన్నారు. ముస్లింలకు చిత్తశుద్ధితో రాజకీయ సాధికారత కల్పించిన వ్యక్తి జగన్ అని.. ఆంధ్రప్రదేశ్ మొదటి మైనారిటీ డిప్యూటీ సీఎంగా నాకు అవకాశం ఇవ్వటం మాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం అన్నారు.. సిక్కు, జైన్ వర్గాలకు కూడా సంక్షేమ కార్పొరేషన్లను దేశంలోనే మొదటి సారి ఏర్పాటు చేసిన వ్యక్తి సీఎం జగన్.. శాసన మండలికి మొదటి సారి ఒక మహిళకు డిప్యూటీ ఛైర్మన్ కు అవకాశం ఇచ్చారు.. ఇంత మంది మైనారిటీలు ముఖ్యమంత్రితో సమానంగా వేదిక పంచుకునే అవకాశం గతంలో ఎప్పుడూ లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష.