NTV Telugu Site icon

AP Constable Exams: ఏపీ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు

Appolic1

Appolic1

ఏపీలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 95, 208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య 4, 59, 182గా ఉంది. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్‌ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది.

Read Also: Adah Sharma : అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న అదా

ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్ని విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు రెండో దశకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అందులోనూ అర్హత సాధిస్తే మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.

Read Also: Revanth reddy: రేపటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ విడుదల