NTV Telugu Site icon

YSR Kalyanamasthu: బటన్‌ నొక్కిన సీఎం జగన్‌.. వారి ఖాతాల్లో సొమ్ము జమ

Ys Jagan

Ys Jagan

YSR Kalyanamasthu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో పథకం డబ్బులను విడుదల చేశారు.. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈ రోజు రిలీజ్‌ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. ఈ దఫాలో 10,511 జంటలకు సంబంధించిన రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని.. వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read Also: KTR Comments: కాళేశ్వరాన్ని బద్నాం చేయొద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం

ఇక, బటన్‌ నొక్కి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమని, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు కళ్యాణమస్తు, షాదీ తోఫా అందించామని తెలిపారు. పేదింటి పిల్లలు విద్యావంతులు కావాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకానికి 10వ తరగతి అర్హతలు పెట్టాం.. దీంతో బాల్య వివాహాలు తగ్గుతాయని తెలిపారు.. పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్‌ చేయడం ఈ పథకం లక్ష్యంగా చెప్పుకొచ్చారు.. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరగా.. 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్‌ జగన్ సర్కార్ అందించిన మొత్తం సాయం 349 కోట్ల రూపాయలు కాగా.. 46 వేల మందికి లబ్ధి పొందారు.