NTV Telugu Site icon

CM YS Jagan: నేతాజీకి సీఎం జగన్‌ నివాళులు

Ap Cm Jagan

Ap Cm Jagan

CM YS Jagan: ఆజాద్ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నివాళుర్పించారు. నేతాజీకి నివాళులర్పిస్తూ సీఎం జగన్‌ ట్వీట్ చేశారు. “స్వతంత్ర భార‌తావ‌నే ల‌క్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌.యువ‌త‌లో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగ‌స్వాముల‌ను చేశారు. నేడు ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నాను.” అంటూ సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.

Read Also: Chinta Mohan: చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు..

తెల్లదొరల పాలన అంతం కావడానికి ఒక్క అహింసా మార్గం సరిపోదని.. సాయుధ పోరాటం బాట పట్టిన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భావి తరాలకు ఈయనే ఆదర్శం. నేతాజీ సుభాష్ చంద్రభోస్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఈయన జాతీయవాద భావాలు బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశానికి సాతంత్య్రం రావడానికి ఎంతగానో సహాయపడ్డాయి. అలాగే యువ తరాల యువ తరాల హృదయాలలో దేశభక్తిని పెంపొందించాయి.