Site icon NTV Telugu

Group-1 and Group-2: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Ys Jagan

Ys Jagan

Group-1 and Group-2: నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యంగా ఎంతో కాలంగా గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్‌.. ఎందుకంటే.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. ఈ రోజు ఉదయం సీఎం జగన్‌కు అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని తెలిపారు.. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని పేర్కొన్నారు.. ఇక, గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు.. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. నోటిఫికేషన్‌, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు సీఎం జగన్‌.

Read Also: TS POLYCET: రేపే టీఎస్ పాలిసెట్‌ ఫ‌లితాలు.. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే విడుదల

Exit mobile version