Site icon NTV Telugu

AP CM secretary Duvvuri Krishna: ఎఫ్ఆర్బీఏం నిబంధనల ప్రకారమే ఏపీకి రుణాలు..

Duvvuri Krishna

Duvvuri Krishna

AP CM secretary Duvvuri Krishna: ఏపీలో అప్పుల గురించి తీవ్ర స్థాయి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి. దువ్వూరి కృష్ణ వెల్లడించారు. విభజన నాటికి ఉన్న అప్పు రూ 1.18 లక్షల కోట్లు.. అది 2019 నాటికి 2.64 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇక 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 4.28 కోట్లుగా ఉందన్నారు. ఇక ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు రూ. 1.44 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. ఇక మొత్తంగా ఏపీ రుణం రూ 5.73 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. పూచీకత్తు లేని విద్యుత్ సంస్థల రుణం కూడా కలిపితే రూ. 6.38 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఏపీ రుణం అంతా ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సహేతుకం కాదన్నారు.

Read Also: IAS Transfers in AP: ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు

ఎఫ్ఆర్బీఏం నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నామన్న ఆయన.. ఈ లెక్కలు అన్ని కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవేనని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా అప్పులు చేయగలమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏదైనా మార్వాడి దుకాణానికి వెళ్లి అప్పులు చేస్తున్నామా అంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్ర పరిమితులు మేరకే అప్పులు చేస్తున్నామని గుర్తించాలన్నారు. అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకో గలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా బ్యాంకులు ఎక్కడైనా రుణాలు ఇస్తాయా అంటూ దువ్వూరి కృష్ణ స్పష్టం చేసారు.

Exit mobile version