Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు (chandra babu) రాష్ట్ర అధికారులకు ఆదేశం ఇచ్చారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడం పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉంటానన్నారు సీఎం చంద్రబాబు. చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేసారు పోలీసులు. మహిళపై అత్యాచారం, హత్య ఘటన పై సీఎం ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోం మంత్రి అనిత. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నేరస్థులు నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్నారు.
Gurukula Teachers: 30వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్.. అదే రోజున హాస్టల్ వెల్ఫేర్ రాతపరీక్షలు
ఇక అతి త్వరలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేపట్టనున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీస్ ఉన్నతాధికారులు మొదలుకుని.. జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నట్లు ఏపీ సీఎం బాబు అన్నారు. అంతే కాకుండా కొందరు ఐపీఎస్ లను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్సుకు త్వరలో బదిలీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
T20 World Cup 2024 : సంచలనం.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం..