Site icon NTV Telugu

CM Chandrababu: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం ఏపీలోనే..

CM Chandrababu: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ ప్రాధాన్యత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వివరించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గత ప్రభుత్వం తీరు… ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4, రాజధాని అమరావతి.. పోలవరంపై సీఎం చంద్రబాబు వివరించారు… రాష్ట్ర అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామన్నారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా వందనం చేసిన చంద్రబాబు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు… ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించిన శకటాలు సీఎం చంద్రబాబు తిలకించారు.

Read Also: Tollywood : మూడు సరికొత్త సినిమాలతో ముస్తాబవుతోన్న టాలీవుడ్

వందే భారత్ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇవాళ 79వ స్వాతంత్య్ర వేడు జరుపుకుంటున్న శుభ సందర్భం.. భారతీయులకు, ప్రపంచంలోని తెలు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులను స్మరించుకుందాం అన్నారు.. స్వాతంత్య్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఎత్తుపల్లాలన చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాల-నాడు కలలుగన్నాం. స్వాతంత్య్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం.. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 195 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్లీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారీ కొత్త సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగిన పరిణామాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాడు నాకు అవకాశం ఇచ్చారు.. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం అని వివరించారు..

Read Also: Tollywood : మూడు సరికొత్త సినిమాలతో ముస్తాబవుతోన్న టాలీవుడ్

అయితే, 2019లో వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది.. ఏపీ బ్రాండ్ ను నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు సీఎం చంద్రబాబు.. రూ.10 లక్షల కోట్లు అప్పులు, బకాయిలతో ఆర్ధిక విధ్వంసం చేశారు. 10 లక్షల కోట్లు అప్పులు బకాయిలతో రాష్ట్రంలో ఆర్థికత్వం సృష్టించారు. 2024 ప్రజలు చారిత్రాత్మ తీర్చారు. సుపరిపాలనలో తొలి అడుగు సంక్షేమం అభివృద్ధి నినాదంతో చేసుకున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్. దేశంలోనే రెట్టింపు స్థాయిలో సంక్షేమమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఏ. ఎన్నికల ప్రధాన హామీలన్నీ సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం.. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నాం. సంక్షేమ రాజ్యానికి కొత్త అర్ధాన్ని ఇచ్చాం. ఏడాదికి 33 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు.. ఇప్పటికే 40 వేల కోట్లు కేవలం పెన్షన్ కోసమే ఖర్చు చేశాం. తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి 15000 చొప్పున వారి ఖాతాలో జమ చేశారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లి కొందరు అమలు చేసాం. జనాభా నిర్వహణకు తల్లికి వందనం ఎంతో ఉపయోగపడుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో 47 లక్షల మందికి 20000 చొప్పున అందజేస్తాం. తొలి విడతలో భాగంగా ఇప్పటికే అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలో 7000 జమ చేశాం. దీపం పథకం 2 కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం ఇప్పటికే రెండు కోట్ల రాయితీలు కింద సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం 2684 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు.

Read Also: War 2 : వార్ -2 హిందీ.. 2025 బెస్ట్ ఓపెనింగ్స్ లో ఎన్నో స్థానం అంటే

స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు రాష్ట్రంలో బస్సు పథకం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలకు నెలకు రెండు వేల వరకు ఆదా అవుతుంది.. ఈ పథకం కోసం 1942 కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేసి తీరుతాం అన్నారు.. 16,347 మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేశాం. ఐదు కోట్ల 16 లక్షల మందికి ఐదు రూపాయలకే ఆకలి తీర్చాం. చేతివృత్తులు కులవృత్తుల అన్నింటికీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. బీసీల రక్షణ చట్టం తెచ్చేందుకు మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేస్తుంది.. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు వైసిపి ప్రభుత్వం 24% తగ్గించింది. మేం మరలా దాన్ని 34 శాతానికి పెంచామని తెలిపారు సీఎం చంద్రబాబు..

Exit mobile version