AP CID to Move Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.. ఈ సమయంలో కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిట్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఏపీ సీఐడీ.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
Read Also: Kiran Abbavaram : వరుస ఫెయిల్యూర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం..
కాగా, చంద్రబాబుకు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది.. హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని.. కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించిందని.. దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు.. ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటి వరకూ టీడీపీ ఇవ్వనే లేదు.. కేసు మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే అని మండిపడ్డుతున్నాయి.. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.. బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది. బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాల పై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు.. దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.