Site icon NTV Telugu

Amaravati: ఏపీ కెబినెట్ సమావేశం వాయిదా..

Sam (15)

Sam (15)

ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… నేడు మధ్యాహ్నం నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ అర్థాంతరంగా వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది. తొలుత కేబినెట్ భేటీ నిర్వహించి అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి ఆమోదముద్ర వేయనున్నారు.

అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నారు. ఇక పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్, నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్ కాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపి చట్ట సభల్లో ప్రవేశపెట్టనున్నారు.

Exit mobile version