NTV Telugu Site icon

Anushka Shetty: ఆ స్టార్ తో మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న స్వీటీ..?

Anushka

Anushka

జేజేమ్మ, స్వీటీ అంటే టక్కున గుర్తుంచ్చేది మాత్రం అనుష్క శెట్టి.. ఆ పాత్రల్లో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం.. భాగమతి సినిమా వరకు హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత స్పీడును తగ్గించింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇటీవలే మిస్‌ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి..

ఈ అమ్మడు సూపర్‌ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసును దోచుకుంది.. రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు… అలాంటి గ్లామరస్‌ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది..

ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్‌ బ్యాక్‌గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్‌ చిత్రం ఫేమ్‌ రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.. అలాగే ఈ సినిమాను రెండు పార్ట్ లు గా తెరకేక్కిస్తున్నట్లు సమాచారం..