Site icon NTV Telugu

Anushka Shetty Marriage: ఏం జరిగినా.. నేను అతన్నే పెళ్లి చేసుకుంటా!

Anushka Shetty Marriage

Anushka Shetty Marriage

Anushka Shetty Opens Up on Marriage: వయసు పెరిగే కొద్దీ.. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం మహిళలకు పరిపాటి. కానీ కొంతమంది సెలబ్రిటీలు వివాహ వయస్సు దాటినా.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పెళ్లి గురించి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ జాబితాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ ‘అనుష్క శెట్టి’ అగ్రస్థానంలో ఉంటారు. అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహం గురించి మాట్లాడారు. స్వీటీ చెప్పిన ముచ్చట్లు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అనుష్క శెట్టి దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. 2005లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమాతో అనుష్క వెండి తెరకు పరిచయం అయ్యారు. స్వీటీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. కొందరు యువ హీరోయిన్స్ కూడా సెటిల్ అయ్యారు. 40 ఏళ్లు దాటినా కూడా అనుష్క ఇంకా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క వివాహం గురించి అనేక రూమర్స్ వచ్చాయి. స్టార్ హీరో ప్రభాస్‌తో స్వీటీ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ అని ఇద్దరు కొట్టిపారేశారు. ఓ బడా వ్యాపారవేత్తతో అనుష్క వివాహం అంటూ వార్తలు వచ్చాయి. అవి కూడా నిజం కాదని తేలింది.

అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వివాహం గురించి మాట్లాడారు. ‘బాహుబలి సినిమా తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి బాగా పెరిగింది. నా కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని అంటున్నారు. మీడియా మాత్రమే కాదు.. ప్రతిచోటా ఇదే ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నాకు వివాహ బంధంపై నమ్మకం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ప్రేమ లేకుండా ఎవరినీ పెళ్లి చేసుకోను. ఎవరేమనుకున్నా సరే, ఏం జరిగినా సరే.. నాకు నచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటా. నా తల్లిదండ్రులు కూడా ఇదే చెప్పాను. సరైన వ్యక్తి కోసం, సరైన సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా. సినిమా ఇండస్ట్రీ చెందిన ఎవరినీ పెళ్లి చేసుకోను’ అని అనుష్క చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read: Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!

సౌత్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి.. నాగార్జున, ప్రభాస్, రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్వీటీ.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అనుష్క తాజా చిత్రం ‘ఘాటి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఈ చిత్రం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్రస్తుతం అనుష్క బెంగళూరులో ఉంటున్నారు.

Exit mobile version