Site icon NTV Telugu

Miss Shetty Mr Polishetty Twitter Review: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ.. ‘శెట్టి’స్ ఫన్ ట్రీట్ అంతే!

Miss Shetty Mr Polishetty New

Miss Shetty Mr Polishetty New

Miss Shetty Mr Polishetty Movie Twitter Review: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో తెరకెక్కిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా ప్రీమియర్ షోస్ పడ్డాయి. దాంతో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా ‘సూపర్ హిట్’ అని చాలా మంది అంటున్నారు. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కామెడి వర్కౌట్ అయ్యింది. చూడాల్సిన సినిమా. అనుష్క అదరగొట్టింది’, ‘ఫస్టాఫ్ ఫన్.. సెకండాఫ్ ఎమోషనల్. అనుష్క ఎప్పటికీ రాణే’, ‘సినిమా షార్ట్ బ్లాక్ బస్టర్. నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ హిట్ పడింది.. మరోసారి నాచురల్ రాక్ స్టార్ అనిపించాడు’, ‘ఫస్టాఫ్ కామెడీగా ఉంది. సెంకడాఫ్ వెరీ ఎమోషనల్. మ‌హేష్ బాబు బాగా తీశాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/ThisisHarsha_/status/1699546977636151298?s=20

Exit mobile version