NTV Telugu Site icon

Naveen Polisetty: అనుష్క సెట్ కి రాగానే టెక్నీషియన్స్ తో అలా చేస్తుంది: నవీన్ పొలిశెట్టి

Anushka

Anushka

Miss Shetty Mr Polishetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్ తో సినిమాని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక దీనిలో అనుష్క చెప్పే డైలాగ్ జౌరా అనిపిస్తున్నాయి. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదు ప్రెగ్నెంట్ అయితే చాలు అని అనుష్క చెప్పే డైలాగు వింటేనే అనుష్క క్యారెక్టర్ ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు చేయని కొత్త క్యారెక్టర్ ను అనుష్క చేసినట్లుగా అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా నవీన్ పొలిశెట్టి అనుష్కకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

Also Read:Sreeleela : గందరబాయ్ సాంగ్ తో గందర గోళం లో పడేస్తున్న శ్రీలేల..

మొదట్లో షూటింగ్ కు వెళ్లినప్పుడు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన చేయాలంటే కొంచెం భయంగా అనిపించిందని తెలిపాడు నవీన్ పొలిశెట్టి. అయితే రెండు రోజులు భయపడ్డాక అనుష్క తనకు కంఫర్ట్ జోన్ ఇచ్చిందని ఈ యంగ్ హీరో తెలిపారు. అనుష్కతో ఉంటే ఎవరైనా కంఫర్ట్ గా ఫీలవుతారని చెప్పిన నవీన్ అనుష్క నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని యాంకర్ అడగగా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అనుష్క షూటింగ్ కు రాగానే టెక్నీషియన్స్ అందరికీ ఒక వామ్ హగ్ ఇస్తుందని ఇది కేవలం ఎంకరేజ్ మెంట్ కోసం అభినందనపూర్వకంగా ఇచ్చే హగ్ అని నవీన్ తెలిపాడు. ఆ కౌగిలింత చాలా పాజిటివిటీని నింపుతుందని చెప్పిన నవీన్ పొలిశెట్టి అనుష్కలో ఉన్న మంచి లక్షణాలలో ఇది కూడా ఒకటి అని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో అనుష్కను చూపించింది కొంచెమేనని సినిమాలో మాత్రం తన పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని నవీన్ తెలిపాడు. సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలిపాడు.

Show comments