అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకేక్కిన తాజా చిత్రం నా సామిరంగ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఆ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.. చాలా కాలం తర్వాత నాగార్జున ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ గురించి అందరికీ తెలుసు.. ఈ అమ్మడు ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆషికా రంగనాథ్ అక్క అనూషా రంగనాథ్ (32) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.. అనూష కూడా కన్నడ చిత్ర సీమలో హీరోయిన్‌గా కొనసాగుతుంది. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యుల మాత్రం హాజరైనట్లు సమాచారం.. ఈ పెళ్లి ఫోటోలను ఆషికా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..
అయితే ఈ పెళ్లి గురించి మరిన్ని వివరాలను మాత్రం తెలపలేదు..ప్రేమ పెళ్లి లేదా ప్రేమ వివాహం.. అనే సమాచారాన్ని ఆమె వెళ్లడించలేదు. అంతే కాకుండా తన సోదరి భర్త పేరు శ్రవణ్ అని మాత్రమే చెప్పారు కానీ ఏం చేస్తాడనే విషయాన్ని కూడా వారు తెలుపలేదు. కానీ అతను బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగి అని సమాచారం. అనూష కన్నడలో అనేక సినిమాల్లో, సీరియల్స్ లలో నటించింది.. ఇకపోతే కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కింది.. ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది.. నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తుందో చూడాలి..