Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama: ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకునే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వివాహం, కుటుంబ బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణులను ప్రశ్నిస్తూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వివాహంపై స్పందిస్తూ.. “పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, పిల్లల్ని కనండి అని నరేశ్ గారు గతంలో చెప్పారు కదా, మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో అదే అంటుంది. నిజానికి నాకు పెళ్లికి ముందే ఒక బిడ్డ కావాలనే కోరిక ఉండేది. భవిష్యత్తులో నాకు అసలు పెళ్లవుతుందో లేదో నాకే స్పష్టత లేదు కానీ, ఒక పాపనో బాబునో పెంచుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. అది అడాప్షన్ ద్వారానో లేదా ఐవీఎఫ్ ద్వారానో ఎలాగైనా సాధ్యమే కదా” అంటూ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.
అదేవిధంగా దాంపత్య జీవితంలో భార్యాభర్తల సమానత్వం గురించి మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునేది ఉచితంగా వచ్చే పనిమనిషి కోసం కాదు. ఆడపిల్లల బాధ్యత కేవలం వంటింటికే పరిమితం కాకూడదు. బయటకు వెళ్లి అలిసిపోయి ఇంటికి వచ్చాక మహిళ ఒక్కతే వంటింట్లోకి వెళ్లి వంట చేయాల్సి రావడం, పురుషులు విశ్రాంతి తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఇంట్లో పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. కనీసం ఆమెకు తోడుగా నిలిచే భాగస్వామ్యం (పార్టనర్షిప్) ఉండాలి” అని తన ఆలోచనలను కుండబద్దలు కొట్టారు.
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
తాజావార్తలు
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!