Site icon NTV Telugu

Anupama Parameswaran : టిల్లు తో బోల్డ్ పోజ్ ఇస్తూ న్యూఇయర్ విషెస్‌ చెప్పిన అనుపమ..

Whatsapp Image 2024 01 01 At 10.13.31 Am

Whatsapp Image 2024 01 01 At 10.13.31 Am

అనుపమ పరమేశ్వరన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ భామ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న “టిల్లు స్క్వేర్ “లో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ చాలా వరకూ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన అనుపమ..తాజాగా న్యూఇయర్ విషెస్ చెబుతూ టిల్లూ స్క్వేర్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఫొటోలో ఇలా చాలా బోల్డ్ లుక్‌లో కనిపించింది. ఇదే ఫొటోను అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోనూ ఈ భామ షేర్ చేసింది. తన బ్యాక్ చూపిస్తూ సిద్ధూ జొన్నలగడ్డ ఒడిలో కూర్చొని కిల్లింగ్ చూపులతో అనుపమ అదరగొట్టేసింది.2022లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

రిలీజ్‌కు నెల రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.తాజాగా టిల్లూ స్క్వేర్ టీమ్‌ న్యూఇయర్ విషెస్ బోల్డ్‌గా చెప్పి అభిమానులను ఆకర్షించింది. ఈ మూవీని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. టిల్లూ స్క్వేర్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ సాంగ్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకునేలానే ఉన్నాయి.సింగర్, మ్యూజిక్ కంపోజర్ రామ్ మిర్యాల – లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కాంబోలోనే టిల్లు స్క్వేర్ నుంచి “టికెట్టే కొనకుండా” అంటూ గతంలో మొదటి సాంగ్ వచ్చింది. ఆ పాట ఫుల్ పాపులర్ అయింది. తర్వాత రాధిక సాంగ్ కూడా అదే జోష్‍తో యూత్‍కు కనెక్ట్ అయ్యేలా ఉంది.టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version