Anu Emmanuel : ఆ రూమర్స్ చూసి మా అమ్మ ఎంతో బాధ పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అను ఇమ్మానియేల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ఈ భామకు వరుస ప్లాప్స్ రావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ మధ్యకాలంలో ఈ భామ రావణాసుర,గీత గోవిందం సినిమాలో ఒక చిన్న పాత్ర, నాగచైతన్యతో శైలజ రెడ్డి అల్లుడు, అల్లు శిరీష్ తో ఊర్వసివో రాక్షశివో వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ సినిమాలు ఏవి కూడా అను ఇమ్మానుయేల్ కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి.ఇక ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ కోలీవుడ్ హీరో కార్తీ సరసన జపాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఒక సంఘటనని కూడా ఆమె బయటపెట్టింది. తనని కూడా ఓ నిర్మాత కోరిక తీర్చమని అడిగాడు.కానీ నా కుటుంబ సహాయ సహకారాలతో నేను అందులో నుండి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది.అలాగే గత కొద్ది రోజులుగా ఓ యంగ్ హీరోతో అను ఇమ్మానుయేల్ ప్రేమాయణం సాగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై కూడా ఆ భామ స్పందించింది.నేను ఓ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే నేను కేవలం సినిమా కోసం మాత్రమే ఆ హీరో తో కాస్త క్లోజ్ గా ఉన్నాను.ఆ హీరోతో కేవలం సినిమా పరిచయమే. అంతేకానీ ఆ హీరో తో మీరనుకున్న సంబంధం నాకు ఏమీ లేదు అని తెలియజేసింది..అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసరికి మా అమ్మ ఆ వార్తలు చూసి ఎంతో బాధపడింది. ఇక ఇలాంటి విషయాలు ముందుగా మా మమ్మీకే తెలుస్తాయి. ఎందుకంటే ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతుంది. అందుకే ఇలాంటి వార్తలు దయచేసి వైరల్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
తాజావార్తలు
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!