Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026’కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ సవరణ బిల్లును ఆమోదించిన కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో ఇది చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బహిరంగ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చట్టాన్ని తీసుకురావడమనే ముఖ్యమైన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. పేపర్ లీక్ మాఫియాతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా అడ్డుకోవడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పరీక్షా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
- Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
- Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
- Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం శిక్షలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో అక్రమాలకు పాల్పడినా లేదా పేపర్ లీకేజీకి పాల్పడినా వ్యక్తిగత నేరస్తులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదేవిధంగా.. ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా (గ్యాంగ్ లేదా మాఫియా ద్వారా) నిర్ధారణ అయితే, కనిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్లకు తగ్గకుండా భారీ జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.
తాజావార్తలు
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
-
Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
-
NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!