NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుండి రిలీజ్ కానున్న మరో ట్రైలర్..?

Kalki Trailer

Kalki Trailer

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Vettaiyan : తలైవా ‘వేట్టైయన్’ డిజిటల్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్..?

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 10 న మేకర్స్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లింది.విజువల్ వండర్ గా కల్కి ట్రైలర్ వుంది.కళ్ళు చెదిరిపోయేలా వున్నా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.ఈ సినిమా ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.అలాగే సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ అదిరిపోనున్నట్లు తెలుస్తుంది. కల్కి ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కు 16 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల ముందు మేకర్స్ ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Show comments