Site icon NTV Telugu

Khushi : ఖుషి సినిమా లో నటించబోతున్న మరో స్టార్ హీరోయిన్..!!

Vijay Deverakonda Samantha Tease Fans With Kushi Title Track 001

Vijay Deverakonda Samantha Tease Fans With Kushi Title Track 001

విజయ్ దేవరకొండ హీరో గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి
శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నే వున్నాయి.సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది అని సమాచారం.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టు కుంటుంది. మంచి ఫీల్ తో సాగే ఈ సాంగ్ విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా విడుదల చేసారు.. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీ గా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో స్పెషల్ అప్డేట్ అయితే వచ్చింది.. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక స్పెషల్ రోల్ ఉండబోతుందని సమాచారం… సెకండాఫ్ లో వచ్చే సన్నివేశంలో ఒక పాత్ర ఉందని తెలుస్తుంది… ఆ పాత్ర లో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుంది అని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.ఆ పాత్ర విజయ్ దేవరకొండ కు మాజీ లవర్ పాత్ర అని సమాచారం.. అయితే ఈ వార్త పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ ఇదే నిజమైతే విజయ్, సమంత మధ్యలో మరో స్టార్ హీరోయిన్ ఉండనుందని తెలుస్తుంది.ఈ సినిమా కథ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అని సమాచారం.శివ నిర్వాణ లవ్ స్టోరీని అద్భుతం గా తెరకెక్కిస్తారు .. అందుకే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు

Exit mobile version