NTV Telugu Site icon

Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..

Venu Swamy

Venu Swamy

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. ఆయన చెప్పే జాతకాలలో కొన్ని నిజం అవ్వడంతో ఒక్కసారి సెలెబ్రేటి అయ్యాడు.. అంతేకాదు చాలా మంది సినీ హీరోయిన్లు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.. ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తున్నాడు. తన భార్యతో కలిసి వేణు స్వామి చేస్తున్న రీల్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది..

తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కొన్ని వీడియోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఈ క్రమంలో వేణు స్వామి కూడా తన భార్యతో కలిసి రీల్స్ చేస్తున్నాడు.. మొన్న వేణు స్వామి తన భార్యతో కలిసి చేసిన రీల్ వీడియో బాగానే వైరల్ అయింది.. ఇప్పుడు మరో వీడియోను వదిలాడు..

నాగార్జున మన్మధుడు సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేశాడు. ముందు ఆవిడి ప్రేమించింది.. ఆ తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటూ బ్రహ్మి స్టైల్లో వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అయితే ఈ రీల్ వీడియోకి కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేశారు.. మొదట ప్రభాస్ డైలాగు తో రీల్ చెయ్యడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడుకున్నారు. దాంతో ఇప్పుడు కామెంట్స్ సెక్షన్ ను క్లోజ్ చేశాడు.. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి…

Show comments