ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ డాక్టర్ హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు.
Also Read:Heavy Rain Forecast: చల్లని కబురు.. ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్త పెళ్లికి దారితీసింది. ఈ ఏడాది జనవరి లో పెళ్లి చేసుకుంటానని లేడీ డాక్టర్ ను నమ్మించాడు డాక్టర్ స్వామి. ప్రముఖ హోటల్ కు పిలిచి లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి కి నిరాకరించాడు వైద్యుడు స్వామి. పెళ్లి పేరుతో మోసం చేయడంతో మహిళా వైద్యురాలు స్వామిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
