Site icon NTV Telugu

YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు.. పిలిచినప్పుడు పీఎస్‌కు రావాలని..!

Ys Jagan Press Conference

Ys Jagan Press Conference

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నా.. మిర్చి యార్డులో పర్యటించారని కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కావటి మనోహర్‌ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది.

Also Read: Pawan Kalyan: పోటీ చేసే దమ్ముందా?.. పవన్‌ కల్యాణ్‌కు మంత్రి సవాల్!

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ గుంటూరు యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. వైసీపీ నేతలు అనుమతి లేకుండా యార్డుకు వెళ్లారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో వైఎస్ జగన్‌ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌తో పాటు అక్కడికి వెళ్లిన నేతలపై కేసు నమోదైంది. నేతలందరికీ పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్‌పై కేసు నమోదయింది.

 

Exit mobile version