Salaar : సలార్ నుంచి రానున్న మరో యాక్షన్ ట్రైలర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సలార్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాట తో సలార్ పై క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది.సలార్ చిత్రం నుంచి రెండో ట్రైలర్ రేపు (డిసెంబర్ 17) రిలీజ్ కానుందని సమాచారం. రిలీజ్ ట్రైలర్ పేరుతో ఇది రానుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కట్ ప్రభాస్ అభిమానులకు యాక్షన్ ఫీస్ట్‌లా ఉంటుందని సమాచారం.
సలార్ మూవీ నుంచి డిసెంబర్ 1న ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ లో దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం, ఖాన్సార్ సిటీ కోసం జరిగే పోరాటాలు చూపించడం జరిగింది.కష్టాల్లో ఉన్న వరదరాజ్కు ఆర్మీలా దేవ సాయం చేయడం వంటివి ఈ ట్రైలర్ లో ఉన్నాయి. ఈ ట్రైలర్ ఎక్కువగా కథ గురించి తెలియజేసేలా ఉంది. అయితే, ఈ రెండో ట్రైలర్ మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లతో నింపేసినట్లు సమాచారం.సలార్ చిత్రం లో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో నటించగా శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి మరియు రామచంద్ర రాజు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు
Also Read
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!