NTV Telugu Site icon

Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడంటే?

Annapoorni

Annapoorni

లేడీ బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు… నయన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి..

ఈ సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది.. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది. చెఫ్ కావాలని కలలుకంటుంది. కానీ ఆమె కలకు తల్లిదండ్రులు అడ్డుచెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్‌ చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది.. అన్నపూర్ణికథ జనాలకు నచ్చకపోవడంతో సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేకపోయింది. ఈ సినిమా నయనతారకు నిరాశను మిగిల్చింది..

ఈ సినిమా విడుదలై నెల కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీ లోకి రానుంది.. థియేటర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.. ఇకపోతే తమిళ్ తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో అన్నపూర్ణి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..