టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది..విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి.. అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. ఏదొక వార్తతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. తాజాగా తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది..
ప్రస్తుతం ఈ అమ్మడు గీతాంజలి సీక్వెల్ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అంజలి పాల్గొంది. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ఈ సందర్బంగా ఆమె పెళ్లిపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయని ఓ రిపోర్టర్ అడగ్గా.. అతనికి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది..
ఆమె మాట్లాడుతూ.. పెళ్లికూతురుగా రావాల్సింది నేను.. కానీ నాకు ఎవరూ చెప్పలేదు. ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదో సారి మ్యారేజ్ చేయడానికి చూస్తున్నారు.. పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు అని ఒక్కమాటతో రూమర్స్ కు చెక్ పెట్టేసింది.. అయితే ఎవర్ని చేసుకుంటుందో అన్న విషయం పై మళ్లీ వార్తలు మొదలయ్యాయి.. ఇక ఈ అమ్మడు నటిస్తున్న గీతాంజలి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..