NTV Telugu Site icon

Anjali Menon: ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న అంజలి..

Anjalii

Anjalii

అంజలి మీనన్.. ఈమె పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడీ డైరెక్టర్ గా పలు సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. ఈమె గతంలో బెంగళూరు డేస్‌, మంచాడి గురు, ఉస్తాద్‌ హోటల్‌ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు.. రీసెంట్ గా ఈమె వండర్‌ ఉమెన్‌ తెరాకెక్కించారు.. ఆ సినిమా మొదట విమర్శలు అందుకున్న కూడా విడుదలై ప్రశంసలు అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కించబోతున్నారు..

ప్రస్తుతం ఈమె కొలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఈసారి తమిళ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కేఆర్‌జీ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ఈ సంస్థ తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. అంజలిమీనన్‌ తో సహా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని ఇటీవల ఓ పాల్గొన్న ఆమె చెప్పుకొచ్చారు..

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త కథలను అందించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాలు రూపోందిస్తామని చెప్పుకొచ్చారు.. ఇక దర్శకురాలు అంజలిమీనన్‌ మట్లాడుతూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రపంచ స్థాయి కథా చిత్రాలను రూపొందిస్తామని చెప్పారు.. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తామని తెలిపారు..