NTV Telugu Site icon

Geethanjali Malli Vachindi : గీతాంజలి సీక్వల్ క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన అంజలి..

Whatsapp Image 2024 01 07 At 3.58.03 Pm

Whatsapp Image 2024 01 07 At 3.58.03 Pm

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ప్రముఖ రైటర్ మరియు ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అంజలి 50 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమా కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది..ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంజలి ఈ సినిమా పై తన అనుభవాలు, అభిప్రాయాలను పంచుకుంది.

‘గీతాంజలి’ నా కెరీర్‌ లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. నేను ఈ సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తయితే..క్లైమాక్స్ మరో రేంజ్‌ లో ఉంటుంది. అదిరిపోయే విజువల్స్ తో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా రూపొందింది..ఈ సీక్వెల్‌లో అలీ, సునీల్, సత్య ఇలా అందరూ ఎంతగానో నవ్విస్తారు” అని అంజలి తెలిపింది.డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ మరియు రాజేష్ నా కోస్టార్స్‌ గా పార్ట్ 1లో నటించారు. సీక్వెల్‌లో కూడా నవ్విస్తారు.ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజుగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఈ సినిమాలో గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు మాత్రం భయపెడతాయి. వాటిని థియేటర్స్‌ లో చూడాల్సిందే” అని అంజలి చెప్పుకొచ్చింది.