NTV Telugu Site icon

Anjali 50 : ఆ నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న గీతాంజలి సీక్వెల్..

Whatsapp Image 2023 11 26 At 7.09.24 Pm

Whatsapp Image 2023 11 26 At 7.09.24 Pm

తెలుగు భామ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ రాజోలు భామ గ్లామరస్‌ పాత్రలతో పాటు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌ రోల్స్ చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది.ఈ బ్యూటీ డ్యూయల్ రోల్ లో నటించిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత గీతాంజలి మూవీ కి సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా అంజలి టైటిల్ రోల్ పోషిస్తుంది.. సీక్వెల్ గా వస్తున్న గీతాంజలి మూవీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ 2024లో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కానుంది.అయితే ఈ చిత్రం లో శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌ మరియు రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అంజలి 50 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ జెట్‌స్పీడ్‌లో కొనసాగుతోంది. మిమ్మల్ని ఊపిరాడక చేసేందుకు సీక్వెల్‌ ఉండబోతోందని హామీ ఇస్తున్నాం..ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024లో వస్తోంది అని మేకర్స్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో హిందీ లేకపోవడంతో ఈ మూవీ ఆ భాషలో సినిమా రావడం లేదని క్లారిటీ వచ్చేసింది. అంజలి ప్రస్తుతం రాంచరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో ఆర్‌సీ 15గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూరులో కొనసాగుతోంది. అంజలి మరోవైపు విశ్వక్‌ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సినిమాలో కూడా నటిస్తోంది.గీతాంజలి సినిమాతో నవ్విస్తూ భయపెట్టిన అంజలి సీక్వెల్ తో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి..

https://x.com/KonaFilmCorp/status/1728664168331715062?s=20