NTV Telugu Site icon

Music Director : ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Anirudh Ravichander Remuneration

Anirudh Ravichander Remuneration

Music Director : ప్రస్తుతం నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో తీసిన సినిమాను ఆ హీరో మార్కెట్ ను బట్టి వీలైనన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువ మందికి కంటెంట్ ని రీచ్ చేయడం కోసం మేకర్స్ తో పాటు ఓటీటీ ఛానళ్లు కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలకు మార్కెట్ పరిధి పెరిగింది. సినిమాకి ఎక్కువ వేల్యూయేషన్ వచ్చింది. అన్ని భాషల్లో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే యూనివర్శల్ కథలతోనే చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మ్యూజిక్ కూడా చాలా కీలకమైంది. కథని ప్రేక్షకులకి బాగా రీచ్ చెయ్యాలంటే మ్యూజిక్ కూడా చాలా ముఖ్యం. అదిరిపోయే ఎలివేషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. అలాంటి వారిలో అనిరుధ్ రవిచందర్ అగ్రస్థానలో నిలిచాడు.

Read Also:Telangana Assembly Session 2024: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ రాకపై నో క్లారిటీ..

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమిళంలో స్టార్ హీరోలందరి సినిమాలకి ఆయనే మ్యూజిక్ అందించే రేంజ్ కు ఎదిగాడు. తెలుగులో కూడా ‘దేవర’ మూవీ సక్సెస్ తో అనిరుధ్ కి డిమాండ్ పెరిగింది. ‘జైలర్’, ‘లియో’ లాంటి సినిమాలు అతని మ్యూజిక్ కారణంగానే సూపర్ హిట్ అయ్యాయన్న టాక్ కూడా ఉంది. దీంతో అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చాలా మంది మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని పారితోషికం కూడా పెరిగింది. ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు. తాను సినిమాకి రూ.10 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే అనిరుధ్ ఇప్పుడు రూ.15 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘దేవర 1’ తర్వాత అనిరుద్ తన రెమ్యునరేషన్ ని మరింతగా పెంచినట్లు టాక్. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఇప్పుడు దూసుకుపోతున్నాడు. కింగ్ ఖాన్ షారుఖ్ కి ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత బాలీవుడ్ లో కూడా ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది.

Read Also:Niharika Konidela : నిగమ్ తో నిహారిక రొమాంటింక్ సాంగ్.. చలి కాలంలో చెమటలు గ్యారెంటీ