Animal : మూవీ లవర్స్ కి రిపబ్లిక్ డే ట్రీట్.. రేపే యానిమల్ ఓటీటీ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. వారి నిరీక్షణకు తెరదించుతూ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పారు.ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సినిమా థియేటర్ వెర్షన్‌లో 3 గంటల 21 నిమిషాలు ఉండగా అదనంగా ఓటీటీ వెర్షన్‌కు 8 నిమిషాలు జత చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే విజయ్(రణబీర్‌కపూర్)కు నాన్న అంటే పిచ్చి ప్రేమ.చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే తనకి ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా ఎంతో వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి..అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది ఈ చిత్ర కథ.. దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని ఎంతో వైల్డ్ గా తెరకెక్కించాడు.. అంతేకాదు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్ మూవీని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
Also Read
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..