అనిల్ రావిపూడి వరుస విజయాలతో టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన అనిల్, ఇప్పుడు తన 10వ సినిమాతో ఒక అరుదైన రికార్డుపై కన్నేశారు. ఒకవేళ ఆయన తదుపరి సినిమా అక్కినేని నాగార్జునతో గనుక కుదిరితే, ఈ తరంలో నలుగురు సీనియర్ టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ చరిత్ర సృష్టిస్తారు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కూడా ‘హలో బ్రదర్’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నాగ్‌తో ప్లాన్ చేయమని అనిల్‌ను సోషల్ మీడియాలో కోరుతున్నారు.
Also Read : Sardar 2 : సర్దార్ 2 వచ్చేస్తోంది.. ఈ ఏడాదే కార్తీ యాక్షన్ ధమాకా!
అయితే, ఈ రేసులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్స్‌లో రామ్ చరణ్ ప్రత్యేకంగా పాల్గొనడం, అనిల్ రావిపూడి సైతం చరణ్‌తో పాన్ ఇండియా రేంజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉందని ఆసక్తి చూపడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ లేదా రవితేజతో కూడా ప్రాజెక్టులు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో , మరో 3 నుండి 4 వారాల్లో తన 10వ సినిమా హీరో ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తానని అనిల్ స్పష్టం చేశారు. హీరో ఎవరైనా సరే, 2027 సంక్రాంతికి మాత్రం తన మార్క్ ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
