NTV Telugu Site icon

Andrapradesh : ఏపీలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు నలుగురు పై యాసిడ్ దాడి..

Ap Ntr District

Ap Ntr District

ఏపీలో రోజూ రోజుకు క్రైం రేటు పెరిగిపోతుంది.. ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తూన్న దుర్మార్గులకు భయం లేదని తెలుస్తుంది.. పోలీసులు నేరస్తుల పై కఠినంగా వ్యవహారిస్తున్న ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఏపీలో మరో దారుణం జరిగింది.. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు నలుగురు పై యాసిడ్ దాడి జరిగింది.. ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది.. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

జిల్లాలోని ఐతవరానికి చెందిన తిరుపతమ్మకు సోషల్ మీడియాలో మణిసింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో తిరుపతమ్మ, మణిసింగ్ సహాజీవనం చేస్తున్నారు. తిరుపతమ్మకు ఇంతకుముందే వివాహమైంది. భర్తతో విడిపోయింది. తిరుపతమ్మకు ఓ బాబు కూడ ఉన్నాడు. మణిసింగ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుండి తనను తిరుపతమ్మ దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందని మణిసింగ్ అనుమానిస్తున్నాడు. అదే సమయంలో తిరుపతమ్మకు మరో విహహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.. అది తెలుసుకున్న అతను కోపంతో రగిలి పోయాడు.. ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసాడు..

ఇక ప్లాన్ ప్రకారం..శనివారంనాడు రాత్రి తిరుపతమ్మ ఇంట్లోనే ఉన్న మణిసింగ్ ఆదివారంనాడు తెల్ల వారుజామున తిరుపతమ్మతో పాటు ఆమె కొడుకు , తిరుపతమ్మ బంధువు కూతురిపై యాసిడ్ పోశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను విజయవాడ గొల్లపూడి ఆసుపత్రికి తరలించారు. గొల్లపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు పరామర్శించారు.. భాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.. ఈ ఘటనకు కారణం అయిన వ్యక్తికి కఠిన చర్యలు అమలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..