NTV Telugu Site icon

Train Accident: ‘రైల్వే నిద్ర నుంచి ఎప్పుడు మేల్కోంటుంది ?’.. రైలు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్షాలు

Mamata Benarjee

Mamata Benarjee

Train Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 9 మంది మరణించారు. మూడు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. రైల్వేశాఖ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశంలో తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు జరగడం చాలా ఆందోళనకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హౌరా-చెన్నై లైన్‌లో రైలు సిగ్నల్‌ను దాటి మరొక రైలును ఢీకొనడంతో అనేక కోచ్‌లు పట్టాలు తప్పాయి. 08532 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు, 08504 విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ ఢీకొనడంతో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక నుంచి రెండు కోచ్‌లు, సిగ్నల్‌కు ముందు వెళ్లిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. దీనిపై విచారణ జరుగుతోంది.

మరోవైపు ఈ రైలు ప్రమాదం తర్వాత, మమతా బెనర్జీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. రైళ్లు ఢీకొనడం, కోచ్‌లు పట్టాలు తప్పడం, కోచ్‌లలో చిక్కుకున్న నిస్సహాయ ప్రయాణికులు ఇలా పదే పదే జరుగుతూనే ఉంది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపాలని, సత్వర సహాయక చర్యలు చేపట్టాలి. తక్షణ దర్యాప్తు కోరారు. రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది అంటూ ప్రశ్నించారు.

Read Also:Kuldeep Yadav Ball: కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బాల్.. బిత్తరపోయిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్

ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం: కేజ్రీవాల్
‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో రాశారు. దేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు పదేపదే జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది.

Read Also:Punjab : డీజీపీ పదవి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు ఐపీఎస్‎లు.. నేడు విచారణ

రైలు భద్రతా చర్యలను కేంద్రం, రైల్వే వెంటనే పునఃపరిశీలించాలి : ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, “జూన్ 2023లో బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది నెలలకే, ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగిన రైలు ఢీకొనడం వల్ల నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను, నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. ” అన్నారు.