Site icon NTV Telugu

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..

Ias

Ias

IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లోని 31 మంది IAS అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ముఖ్య అధికారుల నియామకాలు, అదనపు బాధ్యతలలో కీలక వ్యక్తుల వివరాలు ఉన్నాయి. కేవీఎన్ చక్రధర్ బాబును సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. అలానే మనజీర్ జిలానీ సమూన్ వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే పి. రవిసుభాష్ ను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమించారు.

2025 Nobel Prize Literature: క్రాస్జ్నా హోర్కెకు సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్..

వివిధ పబ్లిక్ కంపెనీలకు సంబంధించి కూడా కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. లోతేటి శివశంకర్ ను APSPDCL ఛైర్మన్ అండ్ ఎండీగా, ఎస్. ఢిల్లీ రావు ను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇంకా పి. రంజిత్ భాషా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా, అదనంగా పాఠశాల మౌళిక సదుపాయాల కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. అలాగే పి. అరుణ్ బాబు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా, జె.వి. మురళి అడిషనల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కమ్ సెక్రటరీగా, టి.ఎస్. చేతన్ CCLA జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బి. నవ్య ను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా, సి.వి. ప్రవీణ్ ఆదిత్య ను APADCL ఎండీగా నియమించారు.

Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!

పరిపాలనా, సమాచార అండ్ వినియోగదారుల వ్యవహారాల శాఖల్లోనూ కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. కె.ఎస్. విశ్వనాథ్ ను సమాచార మరియు పౌర సంబంధాల శాఖకు, ఎక్స్ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌గా నియమించారు. ఆర్. గోవిందరావు సివిల్ సప్లైస్ & వినియోగదారుల వ్యవహారాలు విభాగానికి బదిలీ అయ్యారు. వీరితోపాటు ఎస్. చిన్న రాముడును ఏపి స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీగా, జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ ను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి ట్రాన్స్ కో కు బదిలీ చేశారు. భావనా ఐఏఎస్ ను బాపట్ల జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా నియమించారు. సి విష్ణు చేతన్ ను సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీగా, ఎస్ఎస్ సోబికాను వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా, అభిషేక్ కుమార్ కు ఏఫిమ్యారిటైం బోర్డు సిఇవోగా , ఏపి మ్యారిటైం బోర్డు ఇన్ప్రాస్ట్రచ్చర్ డెవెలెప్మెంట్ కార్పోరేషన్ కు సంబంధించి పూర్తి అధనపు భాద్యతలు చేపట్టనున్నారు.

Exit mobile version