NTV Telugu Site icon

High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్‌ అధికారికి జైలు శిక్ష, జరిమానా

Ap High Court

Ap High Court

High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. అయితే, ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు తీర్పు అమలు మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ప్రవీణ్‌ కుమార్.. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.. అయితే, ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.. భీములపట్నం మండలం , కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, నిషేదిత భూముల జాబితాలో చేర్చారని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. దీనిని నిషేదిత జాబితా నుంచి తొలగించాలని 2017 లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు అయ్యింది.. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రవీణ్‌ కుమార్ కు రెండు వారాల జైలుశిక్ష , 25 వేల రూపాయలు జరిమానా విధించింది.. అయితే, తీర్పు అమలు మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.

Read Also: Pawan Kalyan: వాలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ ఉద్దేశం లేదు.. కానీ..!