AP High Court: హిడ్మా ఎవరు అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. హిడ్మా, హిడ్మా భార్య రాజక్క ఎన్కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్‌ను హిడ్మా ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. మావోయిస్టు గ్రూప్ కమాండర్ హిడ్మా అని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. హిడ్మా, ఆయన భార్యను ఎన్ కౌంటర్‌కు ముందే అదుపులోకి తీసుకుని మూడు రోజులు టార్చర్ చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపాలని కోరారు. పిల్ వేయటానికి మీకేం సంబంధం అని న్యాయస్థానం ప్రశ్నించింది.. మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించామని దీనిపై అభ్యంతరాలు ఉంటే సెషన్ కోర్టుకు తెలపాలన్న ప్రభుత్వం చెప్పినట్లు వివరించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
READ MORE: Car Loan: కారు లోన్ కోసం ఏ బ్యాంక్ లో తక్కువ వడ్డీ ఉంటుందో తెలుసా..
మరోవైపు.. ఇటీవల మారేడుమిల్లి మండలంలో రెండురోజులపాటు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్ శంకర్‌తో కలిపి 13మంది మావోయిస్టుల మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. అయితే, హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ విడుదల చేసింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన మావోయిస్టులను పట్టుకొని ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పి.. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని కేంద్ర కమిటీ ఆరోపించింది.
