NTV Telugu Site icon

AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్‌.. ఈసీ ప్రత్యేక దృష్టి..

New Project (33)

New Project (33)

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివరి చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించారు.. అంటే 4 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియనుంది.. పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. చివరి గంటల్లో ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం.. చివరి రెండు గంటల్లో పోల్ వయొలెన్సుకు ఆస్కారం లేకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటుంది.. బూత్ క్యాప్చరింగ్, తగాదాలు జరగ్గకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. తెనాలి, మాచర్ల, అనంతపురం సంఘటలను తీవ్రంగా పరిగణించిన ఈసీ.. ఈ ఘటనలకు బాధ్యలైన వారిని గృహనిర్బంధం చేయాలని.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. తెనాలి ఎమ్మెల్యే సహా.. మాచర్ల, అనంతపురంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది ఈసీ.. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించిన విషయం విదితమే.

Read Also: Anna Hazare: “ఈడీ” వెంటపడుతున్న వారిని ఎన్నుకోవద్దు.. కేజ్రీవాల్‌పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు