NTV Telugu Site icon

CM YS Jagan: నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం దంపతులు.. అనాథ పిల్లలతో ముచ్చట్లు..

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ రోజు విజయవాడలో పర్యటించారు. రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించారు జగన్‌ దంపతులు.. వారికి వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర మేయర్ భాగ్య లక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. దాదాపు 30 నిముషాల పాటు అనాథ పిల్లలతో ముచ్చటించారు సీఎం జగన్‌.. ఆ తర్వాత నిర్మల్ హృదయ్ భవన్ లో నూతనంగా నిర్మించిన భవనాన్ని చిన్నారులతో కలిసి ప్రారంభించారు ఏపీ సీఎం.. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన.. నిర్మల్ హృదయ్ భవన్ లోని అనాథలను ఆత్మీయంగా పలకరించారు.. అనాథలతో సరదాగా ముచ్చటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు.. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్‌.

Read Also: Sajjala Ramakrishna Reddy: జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర.. గుంట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త..!