Site icon NTV Telugu

AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక అంశాలకు ఆమోదం

Ys Jagan

Ys Jagan

AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్‌.. 55 అంశాలతో కేబినెట్‌ సమావేశం జరిగింది.. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.. ఏపీ సీఆర్‌డీఏ (APCRDA)లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్‌.. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Read Also: Hanuma Vihari: నన్నెందుకు జట్టు నుంచి తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు

సుమారు మూడున్నర గంటల పాటు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగగా.. అజెండా అంశాలపై చర్చ అనంతరం మంత్రులతో రాజకీయ అంశాలపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అద్భుతమైన ఫలితాలపై సీఎం వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అంటూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version