NTV Telugu Site icon

Andhra Pradesh: కొత్త కోడలికి అదిరిపోయే కానుక.. గోదారోల్లా మజాకా..!

Rajamandri

Rajamandri

గోదావరి జిల్లాలు మర్యాదలకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు.. కొత్త వాళ్లు గోదావరి జిల్లాలకు వెళితే చాలు మర్యాదలతో చంపేస్తారు.. బంధువులు అంటే అంత పిచ్చి.. ఎవరికి ఉన్నంతలోనే వారు అయినవాళ్లకు కడుపు నింపుతారు.. ఇటీవల సంక్రాంతికి కొత్త అల్లుడ్లకు రకరకాల వెరైటీలతో భోజనాలను వడ్డీంచిన సంగతి మరువక ముందే ఇప్పుడు మరొకటి వెలుగు చూసింది.. కాబోయే కొత్త కోడలికి అదిరిపోయే కానుకను ఇచ్చారు.. ఆ కానుకలో మర్యాద తగ్గకుండా 108 రకాల స్వీట్స్ ను ఇచ్చారు.. ఏంటో ఈ గోదారోళ్లు బాబోయ్..

వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలో జరిగిన ఓ నిచ్చాయతంభుల కార్యక్రమం లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్ళికూతు తరుపున వారికి పెట్టీన స్వీట్స్ చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి..

ఇక స్వీట్స్ ఎలా చెయ్యాలో తెలియక ఇంట్లో వాడుకలో ఉంటే వస్తువుల రూపంలో కూడా స్వీట్ ను తయారు చేయించారు.. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లి కూతురికి ఇచ్చారు. వీటితో పాటు కూరగాయలు, పాత తరం నాటి రుబ్రోలు పొత్రాలు స్వీట్స్ రూపంలో చేయడమే కాకుండా పండ్లు రూపంలో తయారుచేసిన స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. అక్కడ వారంతా వీటిని చూస్తూ ఉండిపోయారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఏంటో ఈ గోదారోల్ల మర్యాదలు సల్లగుండా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..