ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా.
Also Read : OTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు ఇవే
ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ కు కూడా భారీ స్పందన తెచ్చుకుంది. ఇక చివరిదశ షెడ్యూల్ షూటింగ్ ను శరవేగంగా చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి మరొక సాంగ్ రిలీజ్ కానుంది. ఈ నెల 31న ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ ను మించి ఈ పాట ఉండబోతుందని, రిలీజ్ అయ్యాక చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని సమాచారం. రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబరు 28న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలో మన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తానని రామ్ ధీమాగా ఉన్నాడు.
